అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మోదీ ద్వైపాక్షిక పర్యటన భారత్, అర్జెంటీనా మధ్య బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. 57 ఏళ్ల తర్వాత భారత ప్రధాని అర్జెంటీనాలో పర్యటించడం ఇదే తొలిసారి.