మంగళగిరి ఎయిమ్స్‌లో ఆధునిక సేవలు

భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరి ఎయిమ్స్‌లో ఆధునిక సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్-ఎయిమ్స్) కార్డియాలజీ విభాగంలో కొత్త సేవలు ప్రారంభమయ్యాయి. 7వ తరం బై-ప్లేన్ క్యాత్ ల్యాబ్, ట్రెడ్ మిట్ టెస్ట్(టీఎంసీ)మెషిన్‌ను ఈరోజు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ ప్రారంభించారు. ఈ అధునాతన వ్యవస్థ తమ సంస్థను గుండె సంరక్షణలో ముందంజలో ఉంచుతుందని ఈడీ అండ్ సీఈఓ ప్రొఫెసర్ అహంతేమ్ శాంతా సింగ్ చెప్పారు. ఇది రోగుల భద్రత, ఖచ్చితత్వం, ఫలితాలను మెరుగుపరుస్తూ ప్రపంచ స్థాయి రోగ నిర్ధారణ, ఇంటర్వెన్షనల్ సేవలను అందించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు.