మేము సైతం.. చెవిరెడ్డి కోసం..!

భారత్ న్యూస్ విశాఖపట్నం..మేము సైతం.. చెవిరెడ్డి కోసం..!

చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎర్రావారిపాళెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేముసైతం అంటూ.. రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు..

ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంకు అన్ని పంచాయతీల నుంచి మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..

చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు..

కుటమి కుట్రలతో చెవిరెడ్డిని జైలుకు పంపినా.. ఆయన బయటకు వచ్చేంత వరకు పోరాడుతాం..

ప్రజా ఉద్యమంతో కూటమి కుట్రలను బయట పెట్టి ఎండ గడతాం..

చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతాం.. ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతాం..

అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు.. అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేసిన నేతలు, కార్యకర్తలు..