భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.
25 గ్రాముల కొకెయిన్ ను పట్టుకున్న పోలీసులు.
ముందుగా రాబడిన సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్ లో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు.
సౌత్ ఆఫ్రికా కు చెందిన థామస్ డ్జిమోన్ తోపాటు విశాఖకు చెందిన అక్షయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

వీరి వద్ద నుంచి ఒక కార్,3.6 లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు , ఒక డైరీ స్వాధీనం.
స్వాధీనం చేసుకున్న కొకెయిన్ విలువ 10 నుంచి 15 లక్షలు ఉంటుంది.
నిఘవర్గాలు సమాచారం మేరకు ఈగల్ టీం, విశాఖ పోలీసులు సంయుక్తంగా డ్రగ్స్ ని పట్టుకున్నారు.
థామస్ డ్జిమోన్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అక్షయ్ కు ఇస్తుండగా పట్టుకున్నాము.
అక్షయ్ ని విచారించి గా ఢిల్లీకి చెందిన కొంతమంది పేర్లు చెప్పారు.
విరి కోసం ఢిల్లీ కి పోలీస్ బృందాలను పంపించాము.
డ్రగ్స్ రాకెట్ పై లోతైన విచారణ చేపడుతున్నాము అని
విశాఖ సిపి శంఖ బ్రాత బాగ్చి తెలిపారు