భారత్ న్యూస్ అనంతపురం .. …Ammiraju Udaya Shankar.sharma News Editor…పెద్దిరెడ్డి భూముల ఆక్రమణలపై విచారణ చేయండి – అధికారులకు హైకోర్టు ఆదేశం
బుగ్గమఠానికి చెందిన భూముల ఆక్రమణ అంశంపై తాజాగా విచారణ చేయాలన్న హైకోర్టు – పెద్దిరెడ్డి వివరణ తీసుకుని 4 వారాల్లో విచారణ ప్రక్రియ చేయాలని వెల్లడి
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఆక్రమించిన వ్యవహారంపై తాజాగా విచారణ జరపాలని దేవాదాయశాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తిరుపతి పట్టణం, ఎంఆర్ పల్లి పరిధి సర్వే నంబరు 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాల(మొత్తం 3.88)కు సంబంధించిన దస్త్రాలను వారం రోజుల్లో పెద్దిరెడ్డికి ఇవ్వాలని, తర్వాత వివరణ తీసుకోని మొత్తం నాలుగు వారాల్లో విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.
అందుకు ముందు విచారణ జరిపిన మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్‌తో కాకుండా మరో అధికారితో విచారణ జరిపించాలని పెద్దిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థిస్తున్న నేపథ్యంలో మరో అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 3.88 ఎకరాలను ఖాళీచేయాలంటూ మఠం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తాజాగా విచారణ జరిపాక ప్రతి
