రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధర

భారత్ న్యూస్ విజయవాడ…రికార్డు స్థాయిలో పెరిగిన కొబ్బరి ధర

తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి కాయల దిగుబడి తగ్గడంతో కోనసీమ కొబ్బరికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వెయ్యి కొబ్బరి కాయల ధర ఏకంగా రూ.22 వేల నుంచి రూ.23 వేలకు వరకు పలుకుతోంది. గతేడాది మే నెలలో ఈ ధర రూ.12 వేల వరకు ఉండేది. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగువుతోంది. రికార్డు స్థాయిలో ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.