..భారత్ న్యూస్ హైదరాబాద్….పాశమైలారం పేలుడు ఘటనలో 12 మంది మృతి: మంత్రి దామోదర
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 12 మంది మృతి చెందినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

శిథిలాల కింద నాలుగు మృతదేహాలు దొరికాయని చెప్పారు. మరికొంతమంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
శిథిలాలను తొలగిస్తే మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు.