తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయా???

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయా???

రెండు తెలుగు రాష్ట్రాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు పెరగవచ్చని తెలుస్తోంది.ఏపీలో 50, తెలంగాణలో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది 2026లో నిర్వహించే జనగణన ఆధారంగా జరుగుతుందని సమాచారం. అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. ఏపీలో 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి అసెంబ్లీ స్థానాలు
పెరగనున్నాయి.