భారత్ న్యూస్ గుంటూరు…..పూట గడవక దీన స్థితిలో ఉన్నా సినీనటి పాకీజా..
తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పూట గడవక భిక్షాటన చేసే పరిస్థితుల్లో ఉన్నానని నటి పాకీజా (వాసుగి) తెలిపారు. ఉన్న డబ్బును అమ్మ క్యాన్సర్ చికిత్స కోసం ఖర్చు చేశానని వాపోయారు. CM చంద్రబాబు, Dy. CM పవన్ను కలిసేందుకు ఆమె గుంటూరు వచ్చారు. ‘నా దుస్థితి గురించి తమిళ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. గతంలో చిరంజీవి, నాగబాబు ఆదుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్పించుకుని నాకు పెన్షన్ ఇవ్వాలి’ అని ఆమె కోరారు.
