.భారత్ న్యూస్ హైదరాబాద్….బిజెపి రాష్ట్ర అధ్యక్ష రేసులో ఫైనల్గా ఇద్దరు?
తెలంగాణ :
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియ తుది దశకు చేరింది.
ఆదివారం రేసులో ఉన్న వారు నామినేషన్ వేయనున్నారు.
జూలై 1న అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. అయితే ఈ రేసులో ఫైనల్గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పదవి కోసం డీకే అరుణ, రామచంద్రారావు, రఘనందన్ రావుతో పాటు పలువురు పేర్లు వినిపించినా చివరకు అర్వింద్, రాజేందర్ బరిలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
