భారత్ న్యూస్ కడప ….టీడీపీ కంచుకోటను బద్దలు కొడతాం: అంబటి
రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యమని వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
సమన్వయకర్తగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శ్రీనివాసరావుపేటలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.
రెపల్లెలో మొదలైన తన రాజకీయ ప్రస్థానం సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు వచ్చిందని తెలిపారు.

కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.