..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ :
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బోనాల జాతరకు 15 రోజుల ముందు (ఘటోత్సవం) ఘటాల ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఘటాలకు సంబంధించిన సామగ్రిని కర్బలా మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి ఘటాన్ని ముస్తాబు చేస్తారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని డప్పుల దరువులతో దేవాలయానికి తీసుకువస్తారు.
