డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ

భారత్ న్యూస్ శ్రీకాకుళం….డ్రైవర్ లేకుండానే కారు డెలివరీ

ప్రపంచంలోనే తొలిసారి డ్రైవర్ లేకుండా కారును డెలివరీ చేసి టెస్లా రికార్డు సృష్టించింది. తమ కారు సెల్ఫ్ డ్రైవింగ్ స్కిల్స్ ఏంటో తెలిసేలా టెస్లా ఓ వీడియో పోస్ట్ చేసింది. టెక్సాస్ గిగా ఫ్యాక్టరీ నుంచి 30 ని.లు డ్రైవ్ చేసుకుని టెస్లా కారు తన ఓనర్ ఇంటికి చేరుకుంది. పార్కింగ్ స్లాట్స్, హైవేలు దాటుకుంటూ దానంతట అదే వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.