భారత్ న్యూస్ శ్రీకాకుళం…..బంగాళాఖాతంలో అల్పపీడనం.. వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడనం.. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొంది. భారీ ఈదురుగాలులు వీస్తాయని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
