భారత్ న్యూస్ రాజమండ్రి….రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి
కోనసీమ జిల్లా :
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గంజాయి కేసుకు సంబంధించి నిందితుల కోసం కానిస్టేబుల్స్ తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఎస్ఐ అశోక్ తో పాటు కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
