భారత్ న్యూస్ విజయవాడ…25.06.2025.
తాడేపల్లి.
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం.
పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు హాజరు.
‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ..
‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో వైయస్సార్సీపీ 5 వారాల బృహత్తర కార్యక్రమం.
దీనికి సంబంధించి క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ. ఇంటింటికీ దాన్ని చేర్చేలా కార్యక్రమం ప్రారంభం.
