భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి నిర్మాణానికి మరోసారి భూసమీకరణకు క్యాబినెట్ నిర్ణయం
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు.
కేబినెట్ నిర్ణయాలు
తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలను పర్యాటకశాఖకు బదిలీకి అనుమతి.
రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
పురపాలకశాఖలో 40 బిల్డింగ్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల అప్గ్రేడ్ కు ఆమోదం.
మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.
భవన నిర్మాణ చట్టంలో నిబంధనల సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఆమోదం.
టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
