నేడు మంత్రివర్గ సమావేశం

భారత్ న్యూస్ రాజమండ్రి….నేడు మంత్రివర్గ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి మరింత భూసేకరణపై నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. SIPB ప్రతిపాదనలకు ఆమోదం పలుకుతుందని సమాచారం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది…..