DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

…భారత్ న్యూస్ హైదరాబాద్….DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

దేశానికి సేవ చేయాలని, సాంకేతికత ద్వారా ప్రపంచానికి తోడ్పడాలని కలలు కనే యువతకు గుడ్ న్యూస్. గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDE) కింద పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థ జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..

అర్హత:
ఈ పోస్ట్ కోసం అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ M.Sc డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి CSIR-UGC NET JRF లేదా NET పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:
గరిష్ఠంగా 28 సంవత్సరాలు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

స్టైఫండ్: నెలకు రూ. 37,000

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు
అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ని సందర్శించండి.