భారత్ న్యూస్ విశాఖపట్నం.టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు జగన్ గారి పై వ్యక్తిగత దూషణలు అనవసరం – వైసీపీ యువనేత గౌతమ్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన అసత్య, అసభ్యకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ యువనేత గౌతమ్ తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలా వ్యక్తిగత దూషణలు చేయడం ఆందోళనకరమని,
ఒక మాజీ ముఖ్యమంత్రిని మానసిక స్థితి లేని వ్యక్తిగా చాటిచెప్పడం, జగన్ గారి తలకాయ నరకొచ్చు అంటూ అనటం, అసలు జీవించే హక్కే లేదనటం మరియు ఆయనపై అసత్య ఆరోపణలు చేయడం అనాగరికతకు నిదర్శనమని గౌతమ్ తెలిపారు..,

వైఎస్ జగన్ గారు తన పాలనలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంతో మేలు చేశారని, గ్రామ స్థాయిలో పాలనను తీసుకెళ్లిన ప్రజా నాయకుడు జగనని, అటువంటి నాయకుడిపై విమర్శించాలంటే విధానాలను విమర్శించాలి వ్యక్తిని కాదని, తెలంగాణాలో మారిన పరిస్థితులు టీడీపీ నేతలకు ఉత్సాహాన్నిస్తే దాన్ని ప్రజాస్వామ్యవ్యతిరేకంగా వాడుకోవడం తగదని ప్రజలే నిజమైన తీర్పును త్వరలో ఇస్తారని, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అసభ్యకరమైన వ్యాఖ్యలతో రాజకీయ ప్రాముఖ్యత పొందాలని చూడడం విచారకరమని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను గౌతమ్ తీవ్రంగా కండించారు..