కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సాఫ్ట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించుటకు

భారత్ న్యూస్ గుంటూరు…..కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సాఫ్ట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహించుటకు శ్రీ కొడాలి కిషోర్ మరియు శ్రీ కొడాలి నాగమల్లి గార్ల జ్ఞాపకార్థం వారి సోదరుడు కొడాలి కోటేశ్వరరావు ( అట్లాంట- అమెరికా) గారు సుమారు 20వేల రూపాయల సాఫ్ట్ బాల్ slugger, gloves, మరియు balls ను దివి మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సామర్ల సురేష్, దోవ శేషగిరిరావు గార్ల చేతుల మీదుగా కృష్ణాజిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గరికపాటి మారుతి గారికి అందించారు. ఈ సందర్భంగా గరికిపాటి మారుతి గారు దాతలకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.