భారత్ న్యూస్ ఢిల్లీ…..జలసంధి మూసివేత.. ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్రమంత్రి హర్దీప్
న్యూ ఢిల్లీ :
పెట్రోల్, డీజిల్ రేట్లుపై కేంద్రం శుభవార్త చెప్పింది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్లో పెట్రోల్ రేట్లు పెరుగుతాయనే ఆందోళన నెలకొంది. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ క్లారిటీ ఇచ్చారు. కొన్నేళ్లుగా వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని, అధిక శాతం ఆయిల్ హార్మోజ్ జలసంధి నుంచి రావట్లేదని చెప్పారు. ఆయిల్ కంపెనీల వద్ద కొన్ని వారాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లై చేస్తామని కేంద్ర మంత్రి హార్దిప్ సింగ్ పూరీ పేర్కొన్నారు….
