గుంటూరులో తహసీల్దార్ సంతకం ఫోర్జరి..ఆరుగురిపై కేసు నమోదు..

భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరులో తహసీల్దార్ సంతకం ఫోర్జరి..ఆరుగురిపై కేసు నమోదు..

గుంటూరులోని అరండల పేటలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 2,200 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేసిన ఆరుగురిపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన చంద్రమౌళి, విశాఖకి చెందిన రామకోటేశ్వరరావు, మాదల శ్రీవల్లి, మహమ్మద్ పర్వేజ్, గింజుపల్లి వీరయ్యచౌదరి, వెంకటరెడ్డి కలిసి ఈ పని చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. చంద్రమౌళి లింకు డాక్యుమెంట్ల కోసం స్థలాన్ని శ్రీవల్లి, రామకోటేశ్వరరావు పేరున కొరిటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించాడని, గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.