భారత్ న్యూస్ కడప ….ఒడిశాలో అవమానవీయ ఘటన
కులాంతర వివాహం చేసుకున్నందుకు యువతి కుటుంబసభ్యులు 40 మందికి శిరోముండనం చేసిన గ్రామ పెద్దలు

రాయగడ జిల్లా గోరఖ్ పూర్ పంచాయతీలోని ఓ గ్రామంలో షెడ్యూలు కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆదివాసీ యువతి
యువతి కుటుంబసభ్యులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో 3 రోజుల క్రితం పారిపోయి పెళ్లి చేసుకొని తిరిగి గ్రామానికి వచ్చిన ప్రేమజంట
ఈ విషయం గ్రామ పెద్దలకు తెలియడంతో గ్రామ కట్టుబాట్ల ప్రకారం, యువతి కుటుంబసభ్యులను గ్రామం నుండి వెలివేసిన గ్రామ పెద్దలు
ఈ శిక్ష నుండి తప్పించుకోవడానికి శిరోముండనం చేసుకొని, మూగజీవాలని బలిచ్చి, ప్రేమ జంటకు పెద్దకర్మ చేసిన 40 మంది యువతి కుటుంబసభ్యులు
దీనిపై వివరాలు అడగగా, తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపిన పోలీసులు