పొన్నూరులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

భారత్ న్యూస్ గుంటూరు…..పొన్నూరులో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 29వ వార్డు షరాబజార్ తుకారం రైస్ మిల్లు దగ్గర గురువారం ఓ ఇంట్లో 60 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అర్బన్ సీఐ వీరానాయక్ వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం నిల్వ చేసింది ఎవరు అనే కోణంలో సీఐ విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.