ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..యధావిధిగా సేవలు కొనసాగింపు

భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..యధావిధిగా సేవలు కొనసాగింపు

▪️ దృవీకరణ పత్రాల సేవలు అందుబాటులోకి..

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు.

గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్ అప్డేడేట్ చేసేందుకు నాలుగురోజుల పాటు జీఎస్.డబ్ల్యూఎస్ శాఖ నిలిపివేసింది.

శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాల యాల్లో అందించే సేవలు నిలిచిపోయాయి.

పనులు పూర్తికావడంతో బుధవారం ఉదయం నుంచి యధావిధిగా సేవలు పునరుద్ధరణ జరిగింది.

దీంతో ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్, బియ్యం కార్డులు, ఇళ్లు, స్థల పట్టాలు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు అందుబాటులోకి వచ్చాయి.