భారత్ న్యూస్ అనంతపురం .. Ammiraju Udaya Shankar.sharma News Editor……పుట్టపర్తి: మాజీ మంత్రి రోజా పై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి
రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల్ల గురించి మాట్లాడే హక్కు YCP కి లేదు
రక్త సంబంధం విలువ ఏంటో నాకే తెలుసు
బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిన తప్పుడు ప్రచారం కి నేను బాధపడితే… నా ఇంటి నుంచి జరిగిన విష ప్రచారానికి నేను ఎంత బాధ పడి ఉండాలి ?
నాకు అక్రమ సంబంధాలు అంటగడితే, నేను YSR కి పుట్టలేదు అని మీ సైతాన్ సైన్యం తో ప్రచారం చేయించారు

అన్న అడిగాడు అని,రక్త సంబంధానికి విలువ ఇచ్చి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశా
అన్న ను ఎంతో ప్రేమించా.. పాప నీ ప్రాణం కావాలని అడిగినా వెంటనే ఇచ్చే దాన్ని
అక్క చెల్లెళ్ళు అనేది మీకు ఊత పదం మాత్రమే