ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం

భారత్ న్యూస్ గుంటూరు…..ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కొమ్మెర అంకారావు నియామకం

ఏపీ ప్రభుత్వం మరో సలహాదారును నియమించింది. కొమ్మెర అంకారావు అలియాస్ @ కొమ్మెర జాజి అడవుల పెంపకం సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవిలో ప్లాస్టిక్ ఏరివేత ఒక యజ్ఞంలా నిర్వహించిన చరిత్ర ఈయనకి ఉంది. ఇటీవల పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అంకారావును ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రకటన చేశారు.