…భారత్ న్యూస్ హైదరాబాద్….చంద్రబాబు వచ్చినా బనకచర్లను అడ్డుకుంటాం: కోమటిరెడ్డి
TG: బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. చంద్రబాబు వచ్చినా బనకచర్లను అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, శ్రీశైలం టన్నెల్ పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి వివరించారు.
