…తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

తిరుమల :

ఏపీలోని శ్రీవారిమెట్టు వద్ద ఇప్పటివరకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్ల జారీని అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్కు తాత్కాలికంగా మార్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి ఇక్కడే టోకెన్ల జారీ మొదలు కానుంది. టికెట్లు పొందిన భక్తులు శ్రీవారిమెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద స్కాన్ చేసుకోవాలి. ఇదే సమయంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని నిర్దేశించిన కౌంటర్లలో SSD టోకెన్లు జారీ చేస్తారు.