క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

భారత్ న్యూస్ విజయవాడ…క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

విజయవాడ క్రీడలు, న్యూస్ టుడే:- వైఎస్సార్ కడప జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవచ్చని శాప్ గిరిజన క్రీడాధికారి ఎస్వీరమణ తెలిపారు. ఒక్కో తరగతికి 20 మంది బాలురు, 20 మంది బాలికల చొప్పున ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. వివరాలు ఈ నెల 31న క్రీడాశాఖ వెబ్ సైట్ 🖥️https://apsportsschool.ap.gov.in అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు.