భారత్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో వాయుగుండం
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది ఏర్పడింది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది….
