భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .కన్నుల పండుగగా అమ్మవారికి లక్ష మల్లెలాభిషేకం
చల్లపల్లి:
కృష్ణాజిల్లా, చల్లపల్లి మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నడకుదురులో స్వయంభూగా వెలసిన శ్రీ పృద్వీశ్వర స్వామి ఆలయంలో ఆదివారం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి నిర్వహించిన లక్ష మల్లెలాభిషేకం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కంఠంరాజు గణపతి దీక్షితులు (సాయిబాబు శర్మ) పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి పూజ, గోత్రనామ సంకల్పం స్వామివారికి రుద్రాక్ష పూజ, ధూప, దీప, మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పములు, సమర్పణ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీబాలా త్రిపుర సుందరి అమ్మవారికి మహా స్నపన, అలంకారం చేశారు. శ్రీ లలితా సహస్రనామ పారాయణం అనంతరం మల్లె పుష్పార్చన కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 200 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను గ్రామ పెద్దలు నాదెళ్ల త్రివిక్రమ్ రావు, విశ్రాంత ఆర్టీవో నాదెళ్ల శివరామకృష్ణలు పర్యవేక్షించారు
