హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధిశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో స్కైవాక్ బ్రిడ్జిలు, మల్టీలెవల్ పార్కింగ్, స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అడ్వర్టైజింగ్ బోర్డుల ఆదాయంపై నిఘా ఉంచాలని, కొత్తగా ఎన్నికైన మున్సిపల్ ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.