భారత్ న్యూస్ శ్రీకాకుళం….బాలిక పై అత్యాచారం పాల్పడిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష
ఒంగోలు ఫోక్సో కోర్టు న్యాయాధికారి కె. శైలజ
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నల్లగొర్ల శ్రీనివాసరావు(46)కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
బాపట్ల జిల్లా, కారంచేడు మండలానికి చెందిన ఏడేళ్ల బాలికపై 2020 సెప్టెంబరు 29న శ్రీనివాసరావు అత్యాచారానికి పాల్పడ్డాడు.
కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు.

బాధితురాలికి ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.