రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఎం.ఆర్.పి.ఎస్ (MRPS) నాయకుల తనిఖీ

భారత్ న్యూస్ రాజమండ్రి…రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఎం.ఆర్.పి.ఎస్ (MRPS) నాయకుల తనిఖీ

ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం – వసతుల లేమిపై కూటమి ప్రభుత్వానికి విన్నపం

సత్తెనపల్లి:మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపకులు మాన్య ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జి మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం గురుకుల బాయ్స్ పాఠశాలను ఎం.ఆర్.పి.ఎస్ బృందం సందర్శించింది.
సమస్యల నిలయంగా గురుకులం
పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించిన

ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తన ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు విద్యార్థులను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు నాయకుల దృష్టికి తెచ్చారు. దీనిపై వివరణ కోరేందుకు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదని, నేరుగా కలిసినప్పుడు కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని నాయకులు మండిపడ్డారు. పాఠశాలలోని డైనింగ్ హాల్, బాత్రూమ్స్ మరియు బెడ్స్ ఉన్న గదులను పరిశీలించగా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా, పనిచేసే వారు లేరంటూ సాకులతో తప్పించుకుంటున్నారని ప్రిన్సిపాల్ తమను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని విద్యార్థులు సైతం నాయకుల వద్ద వాపోయారు.
ప్రభుత్వానికి డిమాండ్
“విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను కల్పించి, విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలి” అని ఎం.ఆర్.పి.ఎస్ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బు మాదిగ, పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల జార్జి మాదిగ పాల్గొన్నారు. అలాగే ముప్పాళ్ళ మండల అధ్యక్షులు పెనములూరి నాగేంద్ర బాబు, నరసరావుపేట మండల అధ్యక్షులు వేశపోగు తిమోతి మాదిగ, నాదెండ్ల మండల అధ్యక్షులు కోట ప్రభుదాస్ మాదిగ, గద్దల ఏసుదాస్, చిలక జక్రయ్య, కందుల లాభాను, చింతపల్లి నాగరాజు, చింతపల్లి శ్రీనివాస్, చింతపల్లి బాబు, కందుల శ్రీకాంత్ తదితర ఎం.ఆర్.పి.ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.