క్యాంపస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు.. యూజీసీ కొత్త రూల్స్‌పై వివాదం

భారత్ న్యూస్ గుంటూరు….క్యాంపస్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు.. యూజీసీ కొత్త రూల్స్‌పై వివాదం

📌కేంద్ర విద్యాశాఖ కింద కేంద్ర ప్రభుత్వం స్థాపించిన స్వయం ప్రతిపత్తితో కూడిన యూజీసీ జనవరి 13న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ప్రమోషన్‌ ఆఫ్‌ ఈక్విటీ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రెగ్యులేషన్స్‌, 2026 పేరిట జారీచేసిన ఈ నిబంధనల ప్రకారం వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు ప్రత్యేకంగా ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ క్యాటగిరీలకు చెందిన విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి 24/7 గ్రీవెన్స్‌ హెల్ప్‌లైన్ల ఏర్పాటుతోపాటు సమాన అవకాశాల కేంద్రాలను, సమానత్వ కమిటీలను అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

📌కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కుల ప్రాతిపదిక వివక్షను కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) జారీ చేసిన కొత్త నిబంధనలపై వివాదం రేగింది. ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతాయని, తప్పుడు ఫిర్యాదులకు శిక్ష విధించే నిబంధన లేదని అనేక వర్గాలు యూజీసీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.