భారత్‌-ఈయూ ట్రేడ్‌ డీల్‌.. 18 ఏండ్ల తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత్‌-ఈయూ ట్రేడ్‌ డీల్‌.. 18 ఏండ్ల తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

🚗 భారీగా తగ్గనున్న లగ్జరీ కార్లు, ఆల్కహాల్‌, ఔషధ ధరలు.రైతులు, చిన్న పరిశ్రమలు, ఉద్యోగార్థులకు ఎంతో మేలు.మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’గా అభివర్ణించిన ఉర్సులా వాన్‌డెర్‌

🇪🇺 భారత్‌-యురోపియన్‌ యూనియన్‌ (యూరప్‌లోని 27 సభ్య దేశాలు) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఎట్టకేలకు కుదిరింది. ఈయూ దేశాలకు ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై సుంకాలను జీరోకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ డీల్‌ రూపొందింది. తాజా డీల్‌తో 99.5 శాతం భారత ఎగుమతులపై సుంకాలు ఎత్తేసినట్టు సమాచారం.