అణ్వాయుధ పరీక్షలకు 40 లక్షల మంది బలి!

భారత్ న్యూస్ ఢిల్లీ…..అణ్వాయుధ పరీక్షలకు 40 లక్షల మంది బలి!

ప్రపంచ దేశాలు 1945 నుంచి 2017 వరకు నిర్వహించిన అణ్వాయుధాల పరీక్షల కారణంగా కనీసం 40 లక్షల మందిని అకాల మృత్యువు కబళించింది. వీరంతా క్యాన్సర్‌, ఇతర వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, భారత్‌, ఇజ్రాయెల్‌, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌ల వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు బయటకు కనిపిస్తున్న సమాచారం. మానవతావాద సంస్థ నార్వేజియన్‌ పీపుల్స్‌ ఎయిడ్‌ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.