భారత్ న్యూస్ గుంటూరు….మన శంకర వరప్రసాద్ గారు’ టికెట్స్.. ప్రేక్షకులకు గుడ్ న్యూస్
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగానూ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ మూవీ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
