భారత్ న్యూస్ విజయవాడ..వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్…!
బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి.
జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది.
వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.

అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.