భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
AP: ఏపీలో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ సవరించిన విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఈ మేరకు మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు. ఈ పెంపుతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ద్వారా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.13,150 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపనుంది, రిజిస్ట్రేషన్

ఛార్జీలు పెరగనున్నాయి.