.భారత్ న్యూస్ హైదరాబాద్….కరాటే కళ్యాణిపై దాడికి యత్నం!

టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిభట్ల వండర్ లా వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా, పంజాగుట్ట పోలీసుల సహాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు కళ్యాణిపైకి దూసుకువచ్చి, ఆమె చున్నీ లాగినట్లు సమాచారం.