2026లో పెళ్లిళ్లకు అద్భుతమైన ముహూర్తాలు ఇవే..!!

భారత్ న్యూస్ రాజమండ్రి…2026లో పెళ్లిళ్లకు అద్భుతమైన ముహూర్తాలు ఇవే..!!

కొత్త సంవత్సరం వచ్చింది. పెళ్లి కానివారంతా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇంట్లో పెద్దలు కూడా పెళ్లీడు వచ్చిన పిల్లలకు సంబంధాలు చూడటం మొదలుపెడతారు.

మరికొందరు కొంత ముందుగా నిశ్చితార్థాలు పెట్టుకున్నవారుంటారు. వారంతా కొంత సమయం తీసుకొని పెళ్లి చేసుకుందామనుకుంటారు. అందుకు తగినట్లుగా 2026 సంవత్సరం మొత్తం మంచి పెళ్లి ముహూర్తాలు ఎన్ని ఉన్నాయి? అనే వివరాలను తెలుసుకుందాం.

జ్యోతిష్యం ప్రకారం గురువు, శుక్రుడు ముహూర్తాలకు కారకులు. ఈ రెండు సూర్యుడితో కలుస్తుండటంతో మౌఢ్యమి అవుతుంది. జనవరిలో ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 14 తర్వాతే ముహూర్తాలు ప్రారంభమవుతాయి. అదే నెల 19 నుంచి మంచి ముహూర్తాలున్నాయి. సాధారణంగా మూఢమి ఉందని చాలామంది ఎటువంటి పనులు 14వ తేదీ వరకు తలపెట్టారు. వివాహ ముహూర్తాలు కూడా ఇంతే.

ఫిబ్రవరి నెలలో 19, 20,21,22,24,25,26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

మార్చి నెలలో 4, 5,6,7,8,11,12,13,14,20,21,25,29 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

ఏప్రిల్ నెలలో 1,2,3,4,5,6,7,8,10,11,12,26,28,29,30 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

మే నెలలో 1, 3,5,6,7,8,9,10,12,13 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 18 నుంచి జూన్ 11 వరకు ముహూర్తాలు లేవు.

జూన్ 19,20,21,24,25,27,28 తేదీల్లో ముహూర్తాలున్నాయి.

జూలై 1,2,3,4,5,8,9 తేదీన వివాహా ముహూర్తాలున్నాయి.

ఆగష్టు నెలలో 16,18,20,21,22,23,24,25,26,27,28,30 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

సెప్టెంబర్ నెలలో 1,3,4,5 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

అక్టోబర్ నెలలో 11,14,29,30 మంచి ముహూర్తాలున్నాయి.

నవంబర్ కార్తీక మాసంలో ,11,13,14,18,19,20,21,22,24,25,26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి.

డిసెంబర్ 2,3,,10,12,13,15,16,17,18,19,22,23,27,29,31 తేదీల్లో వివాహా శుభ ముహూర్తాలున్నాయని పండితులు తెలియజేస్తున్నారు.