భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు.

భారత్ న్యూస్ రాజమండ్రి…భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు

Ammiraju Udaya Shankar.sharma News Editor…భీమవరం దుర్గాపురం లో జరిగిన కోడిపందాల లో ఓ బంగారు నగల కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. యజమాని కోడిపుంజుకు 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించిన ఆ కోడిపుంజును బరిలోనికి ప్రవేశపెట్టారు. జీడిపప్పు బాదం వంటి శక్తివంతమైన ఆహారముతో పుంజు సిద్ధం చేయబడి, కాలికి కత్తి కట్టుకొని పందెంలో ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు పందెం రాయుళ్లు నిర్వాహకులు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.