సంక్రాంతి మద్యం అమ్మకాలు.. రూ. 877 కోట్లకు చేరిన అమ్మకాలు

భారత్ న్యూస్ గుంటూరు….సంక్రాంతి మద్యం అమ్మకాలు.. రూ. 877 కోట్లకు చేరిన అమ్మకాలు

ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. జనవరి 9 నుండి 16 వరకు, కేవలం వారం రోజుల్లోనే రూ. 877 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ. 85 కోట్ల అమ్మకాలు జరిగేవి, కానీ పండుగ సీజన్లో ఇవి రెట్టింపు అయ్యాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాలు ఈ వివరాలను వెల్లడించాయి.