ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,100 కోట్లు!

భారత్ న్యూస్ విజయవాడ…ఉద్యోగుల ఖాతాల్లో రూ.1,100 కోట్లు!

Ammiraju Udaya Shankar.sharma News Editor…కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంచి DA బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లల్లో అసలైన పండుగ వాతావరణం నింపింది. ఉద్యోగుల ఖాతాల్లో దాదాపు 1100 కోట్ల రూపాయలు జమయ్యాయి.

2019 నుంచి దాదాపు 60 నెలల పాటు పెండింగ్‌లో ఉన్న DA బకాయిలను కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.25 లక్షల మంది CPS ఉద్యోగులు, మరో 2 లక్షల 70 వేల మంది పెన్షనర్లకు నేరుగా నగదు రూపంలో లబ్ధి చేకూరింది. ఒక్కో ఉద్యోగి ఖాతాలోకి వారి మూల వేతనాన్ని బట్టి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు జమ అయ్యాయి. పండుగ పూట డబ్బులు రావడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
……………
ఇక, రాష్ట్రంలోని 55 వేల మంది పోలీసులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సరెండర్ లీవు బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే, నాబార్డు మరియు విదేశీ నిధులతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం కూడా రూ.1,243 కోట్లు చెల్లించింది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమై, రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఏర్పడింది.
……………
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తమ సమస్యలు విన్నవించుకోగా, పండగ నాటికే బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసి, పండగ వేళ వేల కోట్లు విడుదల చేయడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమంటున్నారు NGO సంఘాల నేతలు. గత ప్రభుత్వంలో జీతాలకే ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి, ఇప్పుడు పండగకు ముందే బకాయిలు పొందే స్థాయికి మారడంపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.