5G సేవల్లో రెండో స్థానంలో భారత్

భారత్ న్యూస్ ఢిల్లీ…..5G సేవల్లో రెండో స్థానంలో భారత్

భారత్లో 5జీ సేవలు అంచనాలకు మించి విస్తరించాయి. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లను దాటింది. దీంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ వినియోగదారుల దేశంగా భారత్ నిలిచింది. తొలి స్థానంలో చైనా కొనసాగుతోంది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన 5జీ సేవలు కేవలం మూడు ఏళ్లలోనే కోట్లాది మంది జీవితాల్లో భాగమయ్యాయి.

అందుబాటు ధరలు, వేగవంతమైన నెట్వర్క్ విస్తరణతో భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న 5జీ మార్కెట్ గా మారింది….