భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి: డీసీపీ
పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలంటే రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా, పెద్దపల్లి పురపాలక సంఘ ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనేనని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన అన్నారు.
