హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ ని కలిసి మెట్రో రెండో దశ నిర్మాణం గురించి చర్చించాను

మెట్రో మొదటి దశ లావాదేవీలు పూర్తయిన తర్వాత రెండో దశ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు

ఇందుకోసం రాష్ట ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారుల పేర్లను పంపాలి

L&T నుంచి ‘మెట్రో నెట్‌వర్క్‌’ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఆ తర్వాత మెట్రో రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి

వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి

కిషన్ రెడ్డి